మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తాడూరు, ఆంధ్రప్రభ ; తాడూరు మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతులు కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకొని మద్దతు ధర పొందాలని ఆయన కోరారు రైతులను మోసం చేస్తే సహించేది లేదని దళారులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ రామచంద్ర రెడ్డి,సర్పంచ్ మల్లయ్య ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ,డైరెక్టర్ల ,రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply