MLA | శ్రీవారి సేవలో..

MLA | శ్రీవారి సేవలో..
- తిరుమలలో ఎమ్మెల్యే కొలికపూడి
- ఉత్తర ద్వారం ద్వారా వేంకటేశ్వరుని దర్శనం
MLA | విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు(MLA Kolikapudi Srinivasa Rao) పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి నుంచి ప్రారంభమైన స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
వీఐపీ బ్రేక్ సమయంలో వేంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రంగనాయక మండపంలో ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, స్వామివారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
