కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి పునఃప్రతిష్ఠ

కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి పునఃప్రతిష్ఠ

  • బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

రేగొండ, ఆంధ్రప్రభ ; రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పునఃప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవం 18 నుండి 21 వ తేదీ వరకు త్రిదండి చిన్న జీయర్ స్వామి కరకమల మూలచే జరుగును. జాతర బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు జరపబడును. జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్‌(గోడ పత్రిక)ను ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోందన్నారు.

పునఃప్రతిష్ఠ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, దాతల సహకారం మరువలేనిదన్నారు. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ వారి తరుపున అన్నదానం కార్యక్రమాలు చేపడుతున్నామని, వారి సహకారం అభినందనీయమన్నారు. ఈ ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే కాకుండా, గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు.గ్రామ సర్పంచ్. మొగిలి,నాయకులు. గుటోజు కిష్టయ్య, మోడెమ్ ఉమేష్ గౌడ్, ఎర్రబెల్లి రవీందర్ రావు,మాజీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి,పబ్బ శ్రీనివాస్, అర్చకులు అధికారులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply