ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే మహత్తరమైన రోజు అని ఆయన పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఆకాంక్షించారు. గత సంవత్సరంలోని అనుభవాలను పాఠాలుగా తీసుకుని, కొత్త సంవత్సరాన్ని ఆశావాదంతో స్వాగతించాలని సూచించారు.
ఉగాది పచ్చడిలా జీవితం కూడా షడ్రుచుల సంగమంగా ఉండాలని, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు సహా ప్రతి వర్గం అభివృద్ధి దిశగా పయనించాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ ఉగాది పండుగ ప్రతి కుటుంబంలో కొత్త ఆశలు, అవకాశాలు నింపాలని, రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
