ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అనంతపురం రాజకీయాల్లో (Anantapur politics) ఒక్కసారిగా హీట్ పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR)పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ (MLA Daggubati Prasad) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతుంది. వార్-2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్.. తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులు తిట్టడం, ఆయన నటించిన వార్ 2 సినిమా (Daggubati Prasad)ను ఆడనివ్వబోనని హెచ్చరించడం, నారా లోకేష్ (Nara Lokesh)పై కామెంట్లు చేయడం వంటివి వినిపిస్తున్నాయి. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. సినిమా ఆడదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ వాయిస్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వాయిస్ అని ప్రచారం జరుగుతుండటంతో జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
మొదట ఖండించిన ఎమ్మెల్యే
అయితే తాజాగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ ఆరోపణలను ఖండించారు. ఆ ఆడియో కాల్స్ నావి కావు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై రాజకీయ కుట్రలు (political conspiracies) జరుగుతున్నాయి. దాని భాగంగానే ఈ బోగస్ ఆడియోలు సృష్టించారు. ఇందులో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతుంది.. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని.. బాలకృష్ణ, ఎన్టీఆర్ (Balakrishna, NTR) సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని.. కానీ, నేను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారు.. ఈ ఆడియో కాల్స్ ఓ బోగస్.. ఇందులో ఎలాంటి నిజాలు లేవు అన్నారు. కాగా, దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశంపై కచ్చితంగా పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారు.. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మనసును నచ్చుకొని ఉంటే.. నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నాను.. నా ప్రమేయం లేకున్నప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి.. ఈ క్షమాపణలు చెబుతున్నాను.. నారా, నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుడునే అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వెల్లడించారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ బోగస్ ఆడియోలపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు కూడా ఎమ్మెల్యే వెల్లడించారు. ఖచ్చితంగా పోలీసులు విచారణ జరిపి, ఇందులో ఉన్న నిజాలు బయట పెడతారని నాకు నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు. దీంతో ఈ ఆడియో వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.
రగిలిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే ఆడియో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలపై జూనియర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేశారు.