MLA Bonda Uma | దివ్యాంగుల సంక్షేమం కోసం..

MLA Bonda Uma | దివ్యాంగుల సంక్షేమం కోసం..
MLA Bonda Uma | పాయకాపురం, ఆంధ్ర ప్రభ : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం సంపూర్ణ అండగా ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. అజిత్ సింగ్‌నగర్‌లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో దివ్యాంగుల సంక్షేమం కోసం అఖిల భారత స్థాయిలో పని చేస్తున్న సక్షమ్ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా విభాగాల ఆధ్వర్యంలో దివ్యాంగుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని, దివ్యాంగ సోదర, సోదరీమణుల సమస్యలు, అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వం వారి కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సమ్మేళనం దివ్యాంగుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ఇలాంటి అర్థవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన సక్షమ్ సంస్థ నిర్వాహకులు, ప్రతినిధులను ఎమ్మెల్యే బొండా ఉమా అభినందించారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను రూ.3,000 నుంచి రూ.6,000కు ఒకేసారి పెంచడం వల్ల దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని, ఇది వారికి పెద్ద భరోసాగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ ప్రాంత ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు గీత, మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానం డైరెక్టర్ బొమ్మదేవర రత్నకుమారి, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఏ.వి.ఎస్.ఎన్. మూర్తి, టీడీపీ జిల్లా కార్యదర్శి గౌసియా, ఎన్. జి. ఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
