MLA | ధాన్యం గోదాంకు శంకుస్థాపన

MLA | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఇసిపేట గ్రామంలో రూ.13 కోట్లతో 10వేల టన్నుల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ధాన్యం నిల్వల గోదాముల నిర్మాణానికి శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వేర్ హౌస్ చైర్మెన్ రాయల్ నాగేశ్వర్ రావు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వెలుగు మండల సమాఖ్య 72 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 3 కోట్ల 68 లక్షల రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ , అధికారులు, సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

