MLA | గురుద్వారను దర్శించుకున్న ఎమ్మెల్యే తోట

MLA | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : భారతదేశంలోని రెండవ ప్రసిద్ధిగాంచిన గురుద్వార పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతరావు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. సిక్కు మత గురువులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రసాదాన్ని స్వీకరించారు. గురుద్వార మత పెద్దలు, పుణ్యక్షేత్రం ముఖ్యులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో పాటు కాంగ్రెస్ శ్రేణులందరినీ సత్కరించారు.

