MLA | ప్రజలు సుభిక్షంగా ఉండాలి

MLA | ప్రజలు సుభిక్షంగా ఉండాలి
- సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట
MLA | జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. భోగభాగ్యాలు అందించేది భోగి పండుగని, రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఈ సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దమని, జుక్కల్ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సంక్రాంతి పండుగ కొత్త కాంతులు నింపాలని, ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆకాంక్షించారు.
