MLA | అభినందనల వెల్లువలు…

MLA | అభినందనల వెల్లువలు…
MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన దావ స్వాతి రమేష్ బాబు, వైస్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాగంశెట్టి సత్తీష్ను సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కన్నెపల్లి మండల అధ్యక్షుడు పప్పుల రామాంజనేయ, యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఏల్పుల రోహిత్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గడ్డం వినోద్ నాయకత్వంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఆధ్వర్యంలో పట్టణ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
