MLA | నీలాద్రీశ్వర స్వామి సేవలో …

MLA | నీలాద్రీశ్వర స్వామి సేవలో …

  • మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు

MLA | తిరువూరు, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని నీలాద్రి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నీలాద్రీశ్వర స్వామివారిని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు దేవస్థానం చైర్మన్, ఈఓ, వేదపండితులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించిన ఆయన, మహాశివరాత్రి పర్వదినం శాంతి, సౌభాగ్యం, సమృద్ధిని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ చీకటి నరసింహారావు, ఈఓ రజిని కుమారి, గ్రామ సర్పంచ్ షేక్ రిజ్వనా, కాంగ్రెస్ నాయకులు షేక్ కరీముల్లా, ఆలయ కమిటీ సభ్యులు, తిరువూరు పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొనగా… స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.

Leave a Reply