MLA | సమస్యలపై సీఎం సానుకూల స్పందన

MLA | సమస్యలపై సీఎం సానుకూల స్పందన
- వినగడప కట్టలేరు వంతెనకు త్వరలో నిధులు మంజూరు.
- సీఎం దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే కొలకపూడి..
MLA | విజయవాడ, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, అభివృద్ధి అవసరాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి, త్వరలోనే అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి, తిరువూరు నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను వివరించారు.
ముఖ్యంగా గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వంతెన నిర్మాణానికి అవసరమైన నిధుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వంతెన నిర్మాణం పూర్తయితే తిరువూరు ప్రాంత ప్రజలకు రాకపోకలు మరింత సులభమవుతాయని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, విద్యార్థుల ప్రయాణాలకు, అత్యవసర సేవలకు కీలకంగా మారుతుందని ఎమ్మెల్యే వివరించారు. అలాగే నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, సాగునీరు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన అంశాలను కూడా సమగ్రంగా వివరించారు.

ఈ అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి, తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వినగడప కట్టలేరు వంతెనతో పాటు ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు త్వరలో మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు దశలవారీగా పరిష్కరించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం భరోసా ఇచ్చారు.
click here to read more : 1.50 lakh | ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు…
