Minister | ఏలూరు జీజీహెచ్ నిర్ల‌క్ష్యం

Minister | ఏలూరు జీజీహెచ్ నిర్ల‌క్ష్యం

Minister | శిశువు మ‌ర‌ణం గోప్యం
గ‌తంలో మంద‌లించినా.. మార‌ని తీరు
మంత్రి హెచ్చ‌రిక‌లూ బేఖాత‌రు
ఆర్ ఎంవోకు మంత్రి చీవాట్లు
బాధ్యుల‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశం

Minister | (ఆంధ్ర‌ప్ర‌భ‌, ఏనీ న్యూస్ నెట్ వ‌ర్క్) : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీబిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనపై ఆరాతీశారు.

గ‌తంలోనే హెచ్చ‌రించినా…

గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని, పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ పై మండిపడ్డారు. తాజాగా నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం, గోపవరం గ్రామానికి చెందిన మహిళ నాగలక్ష్మి డెలివరీ నిమిత్తం ఏలూరు జీజీహెచ్ లో చేరారు. నాగలక్ష్మికి డెలివరీ చేయాల్సిన డాక్టర్ అథియా డెలివరీ డేట్ ఇంకా రాలేదనే కారణంతో డెలివరీ ఆలస్యం చేశారని, దీంతో శిశువు మృతిచెందిందని నాగలక్ష్మీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ కు మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.

Minister

శైశ‌వాన్ని అప్ప‌గించ‌రా?

శిశువు చనిపోయిన విషయాన్ని నాగలక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి, బాధ్యత లేకుండా వెళ్లిపోవడం ఏంటని నిలదీశారు? గతంలోనూ నూజివీడు నియోజకవర్గానికి చెందిన వారి విషయంలోనూ ఏలూరు జీజీహెచ్ సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని, తనకు నివేదిక ఇచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్.ఎం.ఓ ను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే ఎవర్నీ సహించేది లేదని తేల్చిచెప్పారు.

Leave a Reply