Vemulawada | ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్

Vemulawada | ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్
Vemulawada | వేములవాడ, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు పట్టు వస్త్రాలు అందజేశారు. ఆదివారం మహా శివరాత్రి సందర్భంగా భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడ ప్రాముఖ్యత కలిగిన దేవాలయం..
రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో వేములవాడ ప్రాముఖ్యత కలిగిన ఆలయమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఆ నాడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం పోరాటం చేశారని.. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తో వేములవాడ ఆలయం అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. పేదల పట్ల ప్రభుత్వం సానుకూలత గా ఉందని చెప్పడానికి వేములవాడ, సమ్మక్క సారలమ్మ ఆలయాల అభివృద్ధి నిదర్శనమని తెలిపారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో ప్రజా పాలన లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని పేర్కొన్నారు.
పరమ శివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి..
మహాశివుడు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వమే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. మూడు రోజుల పాటు మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ లో ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. వేములవాడ లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశి గా పేరు గాంచింది.. లక్షలాది మంది భక్తుల విశ్వాసం ఉండేలా 150 కోట్ల రూపాయల తో 4 ఎకరాల్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఆలయ అభివృద్ధి పై పర్యవేక్షిస్తున్నారు.
