Minister | విజయం వైపు కొండ విజయలక్ష్మి

Minister | విజయం వైపు కొండ విజయలక్ష్మి
Minister | మంథని, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండ విలోచవరంలో విజయ బావుట ఎగుర వేయడానికి కొండ విజయలక్ష్మి సిద్ధంగా ఉన్నారు. కొండ విజయలక్ష్మి 2001లో సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామానికి మంథని నుండి విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పాటు మంచినీటి సౌకర్యం గోదావరి తీరం నుండి ఏర్పాటు చేసిన విషయాన్ని గ్రామ ప్రజలు మరిచి పోలేకపోతున్నారు.
విజయలక్ష్మి భర్త కొండా శంకర్ మంథని ఎంపీపీగా ఉన్న గత ఐదు సంవత్సరాల సమయంలో విలోచవరం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి(development) చేశారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న విజయలక్ష్మికి గ్రామంలోని అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల మద్దతుతో తాను రెండవసారి సర్పంచ్ గా బరిలో ఉన్నానని మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలందరూ తనకు అండగా ఉండి ఉంగరం గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ప్రజా సేవే(Public Service) నా లక్ష్యం ప్రజలే నా బలం అభివృద్ధి నా ద్యేయంగా గ్రామస్తుల అందరి సమస్యల పరిష్కారం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
