హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam Prabhakar Goud)కు ఈ రోజు అసెంబ్లీ హాల్ (Assembly Hall) వద్ద అవమానం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వెళ్లిన మంత్రి పొన్నంకు అసెంబ్లీ ఆవరణలో లిఫ్టు ఎకే ప్రయత్నం చేశారు. అయితే ఇదీ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కేటాయించిన లిఫ్టు వేరే దాంట్లో వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సూచించారు. దీంతో వేరే లిఫ్టులో వెళ్లిపోయారు పొన్నం. అయితే అదే సమయంలో అదే లిఫ్టులో రాష్ట్ర రెవెన్యూ శాఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) రావడం చూసి మంత్రి పొన్నం షాక్‌కు గురయ్యారు. వెంటనే దిగువకు వెళ్లి తనకు వద్దని, పొంగులేటికి ఎలా అనుమతి ఇచ్చారని, ఇద్దరం సమాన హోదాలోనే ఉన్నామని సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు.
మంత్రి పొన్నంకు అవమానం!
