బాలయ్య అభిమానుల నిరసన
- హిందూపురంలో కాన్వాయ్ అడ్డగింత
( హిందూపురం , ఆంధ్రప్రభ) : సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య (Hindupur MLA Balayya) కు మంత్రి పదవి ఇవ్వాలని ఆలిండియా ఫ్యాన్స్ కన్వీనర్ నంబూరీ తీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూపురంలో బాలయ్య కాన్వాయ్ కు అడ్డంగా ప్లే కార్డుల చేత పట్టుకొని బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాహనం నుంచి కిందకు దిగిన బాలయ్య కు అభిమానులు తప్పకుండా మీరు మంత్రి పదవి తీసుకోవాలని పట్టు పట్టారు.
హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్య మూడు రోజుల పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల (Development programs)కు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే హిందూపురం రూరల్ మండలం కిరికెర పంచాయతీ లో అభివృద్ధి కార్యక్రమానికి వెళుతున్న బాలయ్యకు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన కాన్వాయికి అడ్డంగా ప్లే కార్డులు చేత పెట్టుకొని నిరసన చేశారు. అందుకు బాలయ్య అభిమానులకు నచ్చజెప్పి ముందుకెళ్లారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫ్యాన్స్ (All India fans) కన్వీనర్ నంబూరు సతీష్, మండల కన్వీనర్ రాము మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా బాలయ్యకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని అభిమానుల కోరిక మేరకు ఎమ్మెల్యే బాలయ్యకు తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని వారు తెలిపారు . ఈ కార్యక్రమం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నట్లు కూడా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బాలయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.