Minister | ప్రజాసేవలో ముందుంటా

Minister | ప్రజాసేవలో ముందుంటా

  • గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి ముసుకు దీప్తి నిశాంత్ రెడ్డి

Minister | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజాసేవ కోసమై ఎల్లవేళలా ప్రజల కోసం నేనుంటాన‌ని గ్రామస్తుల సహకారంతో ఊరిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాన‌ని, ప్రజలు అలోచించి తమ అమూల్యమైన ఓటును టూత్ పేస్ట్ గుర్తుకు వేసి గొల్లపల్లి సర్పంచ్ గా భారీ మెజారిటీతో తమను గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి ముసుకు దీప్తి నిశాంత్ రెడ్డి అన్నారు.

మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్(Minister Adluru Laxman Kumar) ఆశీర్వాదంతో గతంలో చాలా అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధికి గ్రామస్తులు సహకారం ఇవ్వాలని దీప్తి నిశాంత్ రెడ్డి కోరారు.

తమ గ్రామాల్లో తమకున్న రాజకీయ అనుభవంతో ప్రజలందరికి అన్నివిధాలా అండగా ఉంటానని, ఎల్లప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటూ సేవలు చేస్తానని, గ్రామ అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తమ గ్రామ ప్రజల సలహా సహకారాలతో పరిష్కరించి, అభివృద్ధి(Development) దిశలో నడిపించుకొని ముందుకు సాగుతానని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా గ్రామ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యక్రమాలు అందరితో కలిసి ముందుకుపోతామని తెలిపారు.

Leave a Reply