Minister | కస్తూరి వాసు మృతి.. నివాళులు..

Minister | కస్తూరి వాసు మృతి.. నివాళులు..

Minister | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ మామ ఐన కస్తూరి వాసు ఈ రోజు ఉదయం స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) హైదరాబాద్ నుంచి హుజూర్‌నగర్ కు చేరుకుని వాసు ప్రార్ధివ దేహంపై పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించినారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… వాసు అకాల మరణం తీరని లోటని వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, పట్టణ ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు.

Leave a Reply