Minister | జగన్మాతకు పూజలు..

Minister | జగన్మాతకు పూజలు..
- మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో, చైర్మన్
- భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి ఆనం
- ఆన్‌లైన్ సేవలు విస్తృతం చేయాలని ఆదేశాలు
Minister | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైన కనకదుర్గమ్మను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనం చేశారు. అనంతరం చైర్మన్, ఈవో అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు.

భక్తులతో మాటామంతి…
కనకదుర్గమ్మ వారి దర్శనానికి శుక్రవారం ఇంద్రకీలాద్రికి వచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భక్తులతో కొద్దిసేపు మాట్లాడారు. సౌకర్యాలపై ఆరా తీశారు. దర్శనానికి ఎంత సమయం పడుతుందని అడిగి తెలుసుకున్నారు.

ఆన్‌లైన్ సేవలు విస్తృతం చేయండి..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు మరింత విస్తృతం చేస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. శుక్రవారం దుర్గగుడిలో ఇటీవల కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్ సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
