Minister | మహిళలు ఆర్థిక సౌలభ్యం పొందాలి

Minister | మహిళలు ఆర్థిక సౌలభ్యం పొందాలి

  • రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

Minister | చెన్నూర్, ఆంధ్రప్రభ : మహిళలు ఆర్థిక సౌలభ్యం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరా మహిళశక్తి సంబరాల్లో భాగంగా క్యాంప్ కార్యాలయం లో మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో సిఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సాహిస్తున్నారని, మహిళలు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. చెన్నూరులో మహిళా సంఘాల అభివృద్ధి కొరకు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply