బాలికల ఆశ్రమ పాఠశాలలో మైండ్ స్పార్క్ ప్రోగ్రాం

బాలికల ఆశ్రమ పాఠశాలలో మైండ్ స్పార్క్ ప్రోగ్రాం
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం మైండ్ స్పార్క్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో విద్యా నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు గణితాన్ని సాంకేతిక విద్య ద్వారా సులభంగా నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు 5 ల్యాప్‌టాప్‌లను అందించి సహకరిస్తున్న మేనేజర్ వికాస్ ఓమర్, అసోసియేట్ మేనేజర్ శివప్రసాద్, ప్రాజెక్ట్ లీడ్ మల్లికార్జున్, కోఆర్డినేటర్ ఉమా మహేష్, భీమ్, బన్సీ లకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చింతా చంద్రకళ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భావన, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
