సహాయక చర్యలో మిల్స్ కాలనీ పోలీసులు..

సహాయక చర్యలో మిల్స్ కాలనీ పోలీసులు..

  • సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
  • పాల్గొన్న ఏసిపి శుభం ప్రకాష్, సిఐ రమేష్, సిబ్బంది.

కరీమాబాద్, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ నేపథ్యంలో వరంగల్(Warangal) అతలాకుతలమవుతుంది. ఈ రోజు కురుస్తున్న భారీ వ‌ర్షంతో ఖమ్మం రోడ్‌లోని నాయుడు పెట్రోల్ పంప్ సమీపం బీఆర్ నగర్ వరద బాధితులను ఏఎస్పీ వరంగల్ శుభం ప్రకాష్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, మిల్స్ కాలనీ సిబ్బంది కలిసి బీఆర్ నగర్ వాసులను సురక్షిత ప్రదేశానికి తరలించినారు.

ఈ సందర్భంగా ఏసీపీ(ACP) మాట్లాడుతూ.. ప్రజలు జిల్లా యంత్రాంగం సూచనలు, సలహాలు పాటించాలనీ, పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని ఎలాంటి సహాయమైనా మేము చేయడానికి మీకు అందుబాటులో ఉంటామనీ, ఎలాంటి సమస్య తలెత్తిన మిల్స్ కాలనీ పోలీసుల(Mills Colony Police)కు, తనకు ఫోన్ చేసినట్లయితే తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు.

ఎట్టి పరిస్థితులలో ఇండ్ల నుండి బయటికి రావద్దని, చిన్నపిల్లలను తల్లిదండ్రులు తమ వద్దనే జాగ్రత్తగా(be careful) ఉంచుకోవాలని ఎలాంటి విద్యుత్ పరికరాలు, స్తంభాలు తాకరాదని ఆయన సూచించారు. కార్యక్రమంలో మిస్ కాలని పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply