Bangladesh | కూలిన మిలిటరీ శిక్షణ విమానం.. 19మంది మృతి

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ లోని ఢాకా (Dhaka) ఉత్తర ప్రాంతంలోని ఓ పాఠశాల క్యాంపస్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) మిలిటరీ శిక్షణ విమానం (Military training aircraft) కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 19మంది మృతిచెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం ఢాకాలోని మైల్‌స్టోన్ స్కూల్ (Milestone School), కళాశాల క్యాంపస్‌లో ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయినట్లు సైనిక, అగ్నిమాపక అధికారి తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో క్యాంపస్ లో విద్యార్థులు ఉన్నారని.. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు (Assistive measures) చేపట్టి.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కూలిపోయిన F-7 BGI విమానం వైమానిక దళానికి చెందినదని బంగ్లాదేశ్ ఆర్మీ ప్రజా సంబంధాల కార్యాలయం ధృవీకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

