గణేశ్ ఉత్సవాల వేళ ఇవాళ మెట్రో సేవల పొడిగింపు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లో గణపతి నవరాత్రులు (Ganapati Navratri) వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు వారాంతం కావడంతో గణేశ్ విగ్రహాలను (Ganesh idols) సందర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాత్రి వేళల్లో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మెట్రో యాజమాన్యం (Metro management) కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం నేడు మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు (Metro rail) రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply