FOUNDATION | బిజెపి కార్యకర్తకు వైద్య చికిత్స

FOUNDATION | బిజెపి కార్యకర్తకు వైద్య చికిత్స
FOUNDATION | కరీమాబాద్, ఆంధ్రప్రభ : సీనియర్ బీజేపీ నాయకురాలు బండి సుజాత భర్త బండి నగేష్ కు ఇటివలా కాలుకి శాస్త్ర చికిత్స జరగగా, విషయం తెలుసుకుని బుధవారం వారి ఇంటికి వెళ్లి వైద్య ఖర్చుల నిమిత్తం వాక్ ఫౌండేషన్ (Walk Foundation) ద్వారా 12000/- రూపాయల ఆర్ధిక సహాయం అందజేశామని వాక్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వన్నాల వెంకట రమణ తెలిపారు.
డాక్టర్ వన్నాల వెంకటరమణ (D.r Vannala Venkataramana) సోదరుడు డాక్టర్ వన్నాల అరవింద్ కుమార్ స్థాపించిన వాక్ సమైక్య ఫౌండేషన్ ద్వారా గత 16 సంవత్సరాల నుండి పేదల సహాయం కొరకు సుమారు 600 పై చిలుక కుటుంబాలకు వర్దన్నపేట నియోజకవర్గం లోని పలు గ్రామాలలో నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, వారి కంటి చూపు కొరకు ఆపరేషన్లు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలు, పేద పిల్లలు చదువుల కొరకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ,అనారోగ్యం తో ఉన్న పేదవారికి చికిత్స కొరకు ఆర్ధిక సహాయం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనీ వన్నాల వెంకటరమణ పేర్కొన్నారు.
