Medical |కోటి సంతకాల సేక‌ర‌ణ విజ‌య‌వంతం

Medical |కోటి సంతకాల సేక‌ర‌ణ విజ‌య‌వంతం

  • జిల్లా కేంద్రానికి తరలిన వైసీపీ నేతలు

Medical | పెడన, ఆంధ్రప్రభ : ప్రభుత్వ మెడికల్ కాలేజీల(Medical colleges)ను ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకొని పెడన నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాలను జిల్లా కేంద్రం మచిలీపట్నం నుంచి రాష్ట్ర కేంద్రానికి పంపించడానికి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాలపై ప్రజలు నిరసన సంతకం చేశారు. బాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) కోటి సంతకాల సేకరణకు ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను పప్పు బెల్లాల్లా ప్రైవేటుకు అప్పగిస్తారా అంటూ అన్ని వర్గాల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ పామర్రు శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్, మాజీ అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్(Simhadri Ramesh), పెనమలూరు నియోజకవర్గం ఇంచార్జ్ దేవాభక్తుని చక్రవర్తి, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు, పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పాల రాము మరియు కృష్ణాజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply