Media | ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి

Media | ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి

  • ఒత్తిడి బెదిరింపులకు పాల్పడే నైజం మాది కాదు
  • విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి
  • మృతుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్న
  • మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

Media | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండి ఆత్మహత్యకు పాల్పడ్డ ఎరుకలి మహాదేవ్ సంఘటనపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదుష్టకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇతరులపై ఒత్తిడి తేవడం బెదిరింపులకు పాల్పడే చర్యలకు కాంగ్రెస్ పాల్పడదని ఇది కాంగ్రెస్ పార్టీ నైజం అంతకన్నా కాదని అన్నారు .

మంగళవారం మక్తల్ లో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎరుకలి మహాదేవ్ ఆత్మహత్య పై విచారణ వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాడ సంతాపం తెలియజేశారు .రకరకాల ఆరోపణలు బయటకు వస్తున్నాయని వాస్తవం ఏంటి అన్నది తేలాల్సి ఉందని అన్నారు .విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు .ఎరుకలి మహదేవ్ ఆత్మహత్యకు పాల్పడడం పట్ల తీవ్ర విచార వ్యక్తం చేస్తూ ఈ సంఘటన తనను ఆందోళనకు గురి చేసిందన్నారు .ఎన్నికల్లో పోటీ చేయడం గెలుపు ఓటమి సహజంగా జరుగుతూనే ఉంటాయన్నారు.

బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ళకాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఏ ఒక్కరిపై ఒత్తిడి తేవడం బెదిరింపులకు పాల్పడడం లేదని చెప్పారు. ఒక వ్యక్తిపై ఒత్తిడి చేయడం బెదిరింపులకు దిగాల్సిన కర్మ తనకు పట్టలేదని అన్నారు. వాస్తవంగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మహాదేవ్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనేనని మంత్రి గుర్తు చేశారు శనాయకుల బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని గుండెపోటు వల్ల మరణించాడని మంత్రి బెదిరించాడని ఇలా రకరకాల ఆరోపణలు బయటకు రావడం బిజెపి నాయకులు నిందలు మోపడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తనకు ఒకరిని బెదిరించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని చెప్పారు.

ఈ క్షణం వరకు మృతుడు మహదేవును ప్రత్యక్షంగా చూడలేదన్నారు. చనిపోయాక వాట్స్అప్లో ఫోటోలు వచ్చినప్పుడు మాత్రమే చూశానని ఏ రోజు కూడా కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదని ఒకవేళ ఆ విధంగా మాట్లాడి ఉంటే బెదిరింపులకు పాల్పడినట్లు తెలిస్తే చట్టరీత్యా ఏ చర్యల కన్నా సిద్ధమని అన్నారు కానీ రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి నాయకులు ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం మానుకోవాలని అన్నారు.గతంలోనూ నర్వలో ఇలాంటి చర్యలకు పూనుకోవడం నిజాలు బయటికి రావడంతో వెనుక తగ్గాలని అన్నారు .మళ్ళీ ఇక్కడ అనవసరంగా నాపై నా పార్టీపై నిందలు మోపడం మానుకోవాలని అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను కోరుతున్నానని చెప్పారు.

వాస్తవాలు బయటికి వస్తాయని అప్పుడు ఎవరు బాధ్యులో తేలుతుందన్నారు. ఒకవేళ నా ప్రమేయం ఏమాత్రం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమైనది రాజ్యాంగంగానికి తానేమి అతీతుడను కానని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఇకనుంచి అయినా బిజెపి నాయకులు ఇలాంటి ఆరోపణలకు దిగడం మానుకోవాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి, జి.రవికుమార్ యాదవ్,కోళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply