మేడ్చల్ – పాశమైలారం లో సిగాచి కెమికల్స్ లో పేలుడు ఘటన మరవకముందే మరో ఫ్యాక్టరీలో నేడు బాయిలర్ పేలుడు ఘటన జరిగింది..మేడ్చల్ పారిశ్రామిక వాడలోని అల్క లైడ్స్ ఫార్మాలో నేటి మధ్యాహ్నం బాయిలర్ పేలింది.. దీంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు.ఈ ఘటనలో అక్కడ విధులలో ఉన్న కార్మికుడు శ్రీనివాసరావు గాయపడ్డారు.. వెంటనే అతడిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
Medchal | అల్క లైడ్స్ ఫార్మాలో బాయిలర్ పేలుడు
