Medchal | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు….

Medchal | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు….

Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ సర్కిల్ లోని మేడ్చల్ పట్టణంలో రాఘవేంద్ర నగర్ కాలనీ ఆచార్య జయశంకర్ చౌరస్తాలో ఈ రోజు గణతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతమాత ఆంగ్లేయుల దాస్య శృంకలాలను ఛేదించుకొని ఆగస్టు 15న స్వాతంత్ర ఊపిరి పీల్చుకుంటే, జనవరి 26న తన రాజ్యాంగాన్ని రూపొందించుకొని సర్వసత్తాక దేశంగా అవతరించిందని అన్నారు. ఎంతోమంది త్యాగదనుల పోరాట ఫలితంగా సాధించుకున్న దేశంలో ఉత్తమ పౌరులుగా బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ స్వామి యాదవ్, నాయకులు బాల్ రెడ్డి, మధుకర్ యాదవ్, సంతోష్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, ప్రవీణ్, రాజిరెడ్డి, మురళి, సాయి, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్, రాధాకృష్ణారెడ్డి, రవితేజ, బ్రహ్మ, సందేశ్, మైపాల్ రెడ్డి, బాలచందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply