Medaram | మేడారం… భక్తిజన సంద్రం…

Medaram | మేడారం… భక్తిజన సంద్రం…

  • భక్తులకు బయట నుండే దర్శనం
  • ఎటు చూసినా జనమే
  • ఇబ్బందులు పడుతున్న భక్తులు
  • ఒక్క పక్క అభివృద్ధి పనులు… మరోపక్క దర్శనాలు
  • పోలీసుల‌ భారీ బందోబస్త్

Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గిరిజన సమ్మక్క సారాలమ్మ జాతరకు ఆదివారం కావడంతో భక్తులతో కిటకిటలాడుతుంది. నేడు ఉదయం నుండే స్థానిక మంత్రి సీతక్క(Minister Sitakka) అభివృద్ధి పనులతో పాటు భక్తులకు కావలసిన సౌకర్యాల గురించి పర్యవేక్షించారు.

సెలవు రోజు కావడంతో తెలంగాణ భక్తులే కాకుండా ఛత్తీస్గడ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రి సీతక్క భక్తులతో సౌకర్యాలకు సంబంధించి వివరాలను సేకరిస్తూ పర్యవేక్షించే సమయంలో జంపన్న వాగు సమీపంలో తప్పిపోయిన పాప కనిపించడంతో పాప‌ను అక్కున చేర్చుకొని కంట్రోల్ రూమ్(Control Room) వద్ద పాపకు సంబంధించిన బంధువులు సంప్రదించి పాపను తీసుకుని వెళ్ళవలసిందిగా కోరారు.

Leave a Reply