Medak | ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా..

Medak | ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా..
గుమ్మడిదల, (ఆంధ్రప్రభ) : ప్రభుత్వం భూములను కొల్లగొడుతూ అక్రమంగా మట్టిని తరలిస్తూ భూ బకాసురులు లక్షల్లో కాసులు సంపాదిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపించారు. గుమ్మడి దల మున్సిపల్ కేంద్రంలోని బీరప్ప గుట్ట వైపు కొందరు కేటుగాళ్లు జెసిబిల సహాయంతో అక్రమం గా మట్టిని తరలిస్తున్నారు.
రాత్రింబవళ్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ దందా నడుపుతున్నారు. ఏకంగా ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ అక్కడున్నటువంటి మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో మట్టిని తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏకంగా ప్రభుత్వ భూ మిని ఒక చెరువుల మార్చడంపై తీవ్రగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి సదరు కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
