Gaman | మాస్టర్​ కార్డియాక్​ చెకప్​.. గమన్ పిలుస్తోంది!

  • తక్కువ ధరకే కీలక వైద్య పరీక్షలు
  • పేదలు, మధ్యతరగి వారికి ఎంతో ఉపయోగం
  • మానవత్వం చాటుకుంటున్న డాక్టర్​ నందకిశోర్​

హైదరాబాద్ ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ :
హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఉన్న‌ గ‌మ‌న్ మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్ మానవ‌త్వాన్ని చాటుకుంటోంది. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తివారికి త‌క్కువలోనే జ‌బ్బుల‌కు ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఈ క్ర‌మంలో గ‌మ‌న్ హాస్పిట‌ల్ మ‌రో ఉదార‌త చాటుకునే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. తక్కువ ధరకే మాస్ట‌ర్ కార్డియాక్ హెల్త్ చెక‌ప్ చేయ‌నున్న‌ట్లు హాస్పిటల్​ చీఫ్ డాక్ట‌ర్ నంద‌కిశోర్ తెలిపారు.

₹1999కే కీలక వైద్య పరీక్షలు..

గ‌మ‌న్ మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రిలో కేవ‌లం ₹1999కే జీఆర్బీఎస్, వైటల్స్ పరీక్షలు, ఈసీజీ, 2డీ ఈసీహెచ్ఓ, టీఎంటీ పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్య నిపుణులు తెలిపారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ పరీక్షలు ఉంటాయని తెలిపారు. కార్డియాక్ హెల్త్ చెకప్ చేయించుకునే వారు పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 7993766123, 9666525208 నెంబర్​లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *