అన్ని విభాగాలలో అంతర్గత బదిలీలు…

అన్ని విభాగాలలో అంతర్గత బదిలీలు…

సూపర్డెంట్లు, ఏఈఓలకు స్థాన చలనం..
భక్తుల సౌకర్యాలు.. సేవలపై ప్రత్యేక దృష్టి…
ఆఫీసు.. ఫీల్డ్ సెక్షన్లు కలిసి లేకుండా వేరువేరుగా బాధ్యతలు…
నిత్యం అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు…

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే రెండో అతిపెద్ద దేవస్థానమైనా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భారీ ఎత్తున అంతర్గత బదిలీలను నిర్వహించారు. దేవస్థానంలోని అన్ని విభాగాలకు సంబంధించి అంతర్గత బదిలీలు పూర్తిస్థాయిలో నిర్వహించిన కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ గతంలో కంటే భిన్నంగా ఈసారి ఆఫీస్, ఫీల్డ్ సెక్షన్లను వేరు వేరు చేస్తూ పూర్తి బాధ్యతలను అధికారులకు అప్పగించారు. మరి ముఖ్యంగా అత్యంత కీలకమైన సుపర్ండెంట్లు, ఏఈఓ ల అంతర్గత బదిలీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ఈవో గతం కంటే భిన్నంగా ఈసారి అంతర్గత బదిలీలను నిర్వహించారు. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ అంతర్గత బదిలీలకు అనుసరించి వారికి కేటాయించిన సెక్షన్లలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ భక్తులకు అందించే సౌకర్యాలు, సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలలో ఈవో తెలిపారు.

.. సూపర్డెంట్ల బదిలీలు ఇలా…

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉన్న మొత్తం 13 మంది సూపర్డెంట్లకు అంతర్గత బదిలీలలో స్థానచలనం కల్పించారు. ఇందులో పి భాగ్య జ్యోతి కి అన్నదానం, డౌన్ హిల్ కౌంటర్స్, స్టాక్ రిజిస్టర్ల పర్యవేక్షణ అప్పగించారు. వై హేమదుర్గమాంబ కు కేశఖండనశాల, దుర్గా ఘాట్ మెయింటినెన్స్ తో పాటు హారతులు, ఆడిట్ వంటి సెక్షన్లను అప్పగించారు. సూపర్డెంట్ వి సూర్యనారాయణమూర్తికి అడాప్టర్ టెంపుల్స్, అకామడేషన్స్, వేద పాఠశాలను అప్పగించారు. ఇక ప్రధాన ఆలయానికి సంబంధించి సూపర్డెంట్ కె శ్రీనివాస్(చందు), తో పాటు పి జగదీష్ కు బాధ్యతలు అప్పగించి మరిన్ని సెక్షన్లలో వీరికి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. డివివి సత్యనారాయణకు లిజస్, లైసెన్స్, ల్యాండ్స్ అండ్ లీగల్ మేటర్ తో పాటు మరికొన్ని సెక్షన్లను అప్పగించారు. మరో సూపెండెంట్ కే హరికృష్ణకు కనకదుర్గ ప్రభ, టోల్ ఫ్రీ కౌంటర్స్, ఎన్ వి ఫామ్స్ తో పాటు స్టేషనరీని అప్పగించారు. సూపర్డెంట్ పి సునీతకు ఫెస్టివల్స్, పూజలు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ తో పాటు మరికొన్ని బాధ్యతలను అప్పగించారు. సూపర్డెంట్ బి కళ్యానికి ప్రొవిజన్ స్టోర్స్, అకౌంట్స్, జిఎస్టి, ఐటి వంటి సెక్షన్లను అప్పగించారు. మరో సూపర్డెంట్ సిహెచ్ వి నరసింహారాజుకు ఎస్టాబ్లిష్మెంట్, సెక్యూరిటీ, శానిటేషన్ ఏజెన్సీ, ట్రస్ట్ బోర్డు వంటి సెక్షన్లను అప్పగించారు. ప్రసాదం ప్రిపరేషన్, డౌన్ హిల్ కౌంటర్స్ మానిటరింగ్ తో పాటు స్టాక్ రిజిస్టర్ల వెరిఫికేషన్ ను మరో సూపర్డెంట్ కే శ్రీనివాసరావుకు అప్పగించారు. ఇక ప్రధానమైన ప్రోటోకాల్, డోనర్ సెల్ బాధ్యతలను ఎం శ్రీనివాసరావు తో పాటు ఎల్ శ్రీనివాసరావు లకు అప్పగిస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు.

.. కీలకంగా ఏఈఓ బాధ్యతలు…

దేవస్థానంలోని అత్యంత కీలకంగా ఉండే ఏఈఓ లకు కూడా అంతర్గత బదిలీలు నిర్వహించిన ఈవో వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. దేవస్థానములోని 8 మంది ఏ ఈ ఓ లకు గతంలో ఉన్న బాధ్యతలను తప్పించి వేరే బాధ్యతలను అప్పగించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు కూడా ప్రత్యేక బాధ్యతలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావుకు సివిరెడ్డి చారిటీస్, ల్యాండ్ మీటర్స్, లీగల్, ఆర్టిఏ వంటి బాధ్యతలను అప్పగించారు. ప్రధానాలయ బాధ్యతలను బివి రెడ్డికి అప్పగించడంతోపాటు ప్రొవిజన్ స్టోర్స్, ఫెస్టివల్, సారీస్ సెక్షన్, గోసాల వంటి బాధ్యతలను అప్పగించారు. కేశఖండన, దుర్గ ఘాట్ మెయింటెనెన్స్ టి తిరుమలేశ్వర్ రావ్ కు అప్పగించారు. మరో ఏఈఓ పి సుధారాణికి అన్నదానం, ఆల్ అకామిడేషన్ సెక్షన్స్ అప్పగించారు. అడాప్టర్ టెంపుల్స్ తో పాటు ప్రసాదం ప్రిపరేషన్, వేద పాఠశాల సెక్షన్ లను పి చంద్రశేఖర్ కు అప్పగించారు. మరో ఏఈఓ ఎన్ రమేష్ కు ఆల్ లీజస్, లైసెన్స్, ఆడిట్, ట్రస్ట్ బోర్డ్ స్టేషనరీ తో పాటు అప్హిల్ డౌన్ హిల్ పర్యవేక్షణను అప్పగించారు. ఏఈఓ కే గంగాధర్ కు కనకదుర్గ ప్రభ, వీఆర్వో బాధ్యతలతో పాటు ప్రోటోకాల్ డోనర్ సెల్ తో మరిన్ని బాధ్యతలను అప్పగించారు. కీలకమైన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లను ఎంఎస్ఎల్ శ్రీనివాస్ కు అప్పగించారు. ఆలయానికి సంబంధించిన అన్ని సెక్యూరిటీ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెవిఎస్ఆర్ కోటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. మరో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాంబాబుకు శానిటేషన్ బాధ్యతలతో పాటు మరిన్ని బాధ్యతలను అప్పగించారు.

Leave a Reply