చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి
వెంకటాపూర్, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన అటికే దివ్య(Atike Divya) (25) అనే వివాహిత ఎలుకల మందు టాబ్లెట్ మింగి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం ఆన్లైన్లో సుమారు రూ.3000 విలువగల వస్తువు భర్త అటికే పరమేష్(husband Atike Paramesh) ఆర్డర్ చేయగా ఎందుకని మందలించగా తను రిటర్న్ పెడతానని పెట్రోల్ బంక్ సూపర్వైజర్ డ్యూటీకి వెళ్ళిపోయాడు.
అనంతరం భర్త డ్యూటీకి వెళ్లిపోగా ఎలుకల మందు టాబ్లెట్ మింగింది. వాంతులు కావడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ములుగు ఆసుపత్రికి(Mulugu Hospital) తరలించారు. చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలుకి కుమారుడు(5), కుమార్తె (2)ఉన్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

