Marriage | ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆదర్శ వివాహం

Marriage | ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆదర్శ వివాహం
Marriage | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎటువంటి ఆడంబరం లేకుండా దండలు మార్చుకొని రిజిస్టర్ కార్యాలయంలో ఆదర్శ వివాహం చేసుకున్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన సుర్కంటి సుధాకర్ రెడ్డి కూతురు యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రినిరెడ్డి కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ని ఈ రోజు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా పనిచేస్తున్న శేషాద్రిని రెడ్డి.. ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ని వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా చేసుకున్న ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు అధికారులు, స్నేహితులు హాజరయ్యారు.

CLICK HERE TO READ MORE : Medaram | జాతర డ్యూటీలు చేసే వారంతా అప్రమత్తంగా ఉండాలి
