market | మానవతా దృక్పథంతో…

market | మానవతా దృక్పథంతో…

  • ఫిర్యాదు అందగానే సీఐ నేతృత్వంలో నాలుగు బృందాల గాలింపు..
  • వేగవంతమైన చర్యలతో యువతిని గుర్తించిన పోలీసులు….
  • సురక్షితంగా కుటుంబానికి చేరిక..

market | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన యువతిని పోలీసులు గంటలోనే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహమ్మద్ అహ్మద్ పాషా కుమార్తె ఫాతిమా మహంతి మార్కెట్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కనిపించకుండా పోయింది. ఆమెకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే సీఐ నాగమురళి స్పందించి ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని స్వయంగా పర్యవేక్షిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. చల్లపల్లి బంగ్లా ప్రాంతంలో యువతి ఉన్నట్లు గుర్తించి, గంటలోపే ఆమెను సురక్షితంగా వెతికి పట్టుకున్నారు. అనంతరం యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. వేగంగా స్పందించి తమ కుమార్తెను సురక్షితంగా తీసుకువచ్చిన పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply