Market | సంక్రాంతి రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు | హైదరాబాద్‌లో నేటి గోల్డ్ రేట్స్

Market | సంక్రాంతి రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు | హైదరాబాద్‌లో నేటి గోల్డ్ రేట్స్
- సంక్రాంతి రోజూ పెరిగిన బంగారం ధరలు
Market | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండగ సందర్భంగా కూడా బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అంటున్నాయి. పండగ రోజు కూడా రేట్లు పెరగడంతో కొనుగోలు ధరలు (Price) బెంబేలెత్తుతున్నారు. ఆభరణాలు కొనేందుకు జంకుతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది.

ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Market) లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,32,010 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,010 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,07,100 రూపాయలకు చేరుకుంది.

