March25th | జీవన్ రెడ్డి లేఖ…

March25th | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. పార్టీని వీడడానికి గల కారణాలను లేఖ ద్వారా వెల్లడించారు. ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలకుపైగా తనతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులను ఉద్దేశించి ఆయన లేఖ విడుదల చేశారు.

March25th

గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక అవమానాలకు గురవుతూ, మానసిక క్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యంకాదని తెలిపారు. ఈ నెల 25న జగిత్యాలలో జరిగే సమావేశంలో పాల్గొని, తన భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై నిర్ణయం తీసుకుంటానన్నారు. మీ సలహాలు, సూచనలతో తన భవిష్యత్‌కు మార్గదర్శకం కల్పించాలని, మీ అండదండలతో మానసిక స్థైర్యం ఇవ్వాలని ఆయన లేఖలో మనవి చేశారు.

Leave a Reply