Mangapeta | భక్తులకు అన్న ప్రసాద వితరణ

Mangapeta | మంగపేట, ఆంధ్రప్రభ : రెండో యాదాద్రి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులకు మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన శ్రీ శివ సాయి టెంట్ హౌస్ యజమాని ధర్మపురి శ్రీనివాస్ ఆదివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన ధర్మపురి శ్రీనివాస్ ఇటీవల ఇరుముడితో శబరిమల తరలి వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని ఇరుముడి అప్పజెప్పారు. తన శబరి యాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా శ్రీ మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం సుమారు 150 భక్తులకు అయ్యప్పస్వామి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
