Mancherials | అక్కేపెల్లిలో ధనుర్మాస ఉత్సవాలు

Mancherials | అక్కేపెల్లిలో ధనుర్మాస ఉత్సవాలు

Mancherials | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్కపెల్లి గ్రామంలోని లక్ష్మి నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి హాజర‌య్యారు.

వికాస తరంగిణి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులకు ప్రవచనాలు చేసి ఆ భగవంతుని పై హితబోధ చేశారు. ఈ ఆంగ్ల సంవత్సరంలో దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, భోగ భాగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు(pilgrimage offerings) వితరణ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు.

Leave a Reply