మన ఇసుక వాహనం పోస్టల్ లో దరఖాస్తు చేసుకోండి..

మన ఇసుక వాహనం పోస్టల్ లో దరఖాస్తు చేసుకోండి..
ఊట్కూర్ తాసిల్దార్ చింతరవి
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇండ్ల నిర్మాణాలు వివిధ అభివృద్ధి పనులకు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అవసరం ఉన్న లబ్ధిదారులు మన ఇసుక వాహనం పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని ఊట్కూర్ తాసిల్దార్ చింతా రవి సూచించారు. బుధవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు దరఖాస్తు సమయంలో ఇందిరమ్మ ఇంటి మంజూరి పత్రం, ఆధార్ కార్డు తో జత చేసి సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల అవసరం మేరకు పోర్టల్ లో తాసిల్దార్ కు పంపిస్తే ఇసుక అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక సరఫరా చేసిన డంపింగ్ నిల్వచేసిన జరిమానా తో పాటు వాహనం సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఊట్కూర్ మండలంలోని ఆయా గ్రామాల వాగుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తే ప్రజలు నిర్భయంగా రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
