తీవ్ర గాయాలతో ఆస్పత్రికి
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా (Peddapalli district) రామగుండం రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుండి దిగిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ రోజు రామగుండం స్టేషన్ లో రన్నింగ్ ట్రైన్ నుండి దిగిన వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే ఆర్పిఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ సమాచారం మేరకు ఘటనా స్థలానికి 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పడాల అభిరామ్, పైలెట్ పానుగంటి శ్రీనివాస్ బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగింది ఇలా…
కరీంనగర్ కు చెందిన సుమిత్ గుప్తా (Sumit Gupta) అనే వ్యక్తి కరీంనగర్ నుండి రామగుండం వెళ్తున్నాడు. ఆయన నిద్రలో ఉన్నాడు. అయితే రామగుండం స్టేషన్ లో ఆయన దిగవలసి ఉంది. రామగుండం స్టేషన్ చూసి, తన స్టేషన్ వచ్చింది అని కదులుతున్న ట్రైన్ ను గమనించకుండా నిద్రమత్తులోనే దిగాడు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమిత్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.