ఆవేశంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఆవేశంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  • చివరి క్షణాల్లో కుటుంబానికి సమాచారం.. కాపాడిన భార్యా బిడ్డలు

కోసిగి (కర్నూలు జిల్లా) ఆంధ్రప్రభ : అతడికి భార్య , నలుగురు పిల్లలు ఉన్నారు. ఏ కష్టమొచ్చిందో.. చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. పురుగుల మందుతాగాడు. అంతలోనే బతకాలని.. ప్రాణభయంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. హుటాహుటిన వెళ్లిన కుటుంబం అతడిని ఆసుపత్రి(hospital)కి తరలించి కాపాడుకుంది. నిజమే క్షణికావేశంలో చచ్చిపోతే.. జరిగే నష్టం అంతా ఇంతా కాదు.

ఆఖరి క్షణంలో పురుగుల‌ మందు తాగక పోతే.. ఈ కష్టం కూడా రాదని నిరూపించే ఘటన ఇది. కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని జంపాపురం(Jampapuram) గ్రామానికి చెందిన ఆవుల రాముడు, గుండమ్మ దంపతుల కుమారుడు ఆవుల ఉసేని(Useni) ఆదివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. ఇంట్లో కోసిగికి వెల్లుతానని చెప్పి దుద్ది గురురాఘ వేంద్ర ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి పురుగుల మందు సేవించాడు.

అంతలోనే ప్రాణ భయంతో ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి పురుగుమందు తాగినట్టు కుటుంబ సభ్యులు ఫోన్ చేశాడు. ఇక దుద్ది గురురాఘ వేంద్ర ప్రాజెక్టు వద్దకు కుటుంబ సభ్యులు చేరుకుని అపస్మారక స్థితిలోని ఉసేనిని బైక్ పై కోసిగి ఆసుపత్రికి తరలించారు. కోసిగి(Kosigi) ఆసుపత్రిలో ప్రథమ చికిత్సా చేసి మెరుగైనా చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఉసేని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఉసేనికి బార్య నాగమ్మ నలుగురు పిల్లలు ఉన్నారు. ఉసేని ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించాడో కారణం తెలియ రాలేదు.

Leave a Reply