MAN | సాలురా ఆర్ఐపై దాడికి యత్నం

MAN | సాలురా ఆర్ఐపై దాడికి యత్నం
MAN | బోధన్, ఆంధ్రప్రభ : సాలురా మండల ఆర్ఐ మెహర్ సాయి పై మందర్నా గ్రామానికి చెందిన విక్రమ్ అనే వ్యక్తి దాడికి ప్రయత్నించినట్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను బోధన్ పోలీసులు పట్టుకున్నారు. ఇరవై రోజులు గడిచినప్పటికి పోలీసులు ఇసుక ట్రాక్టర్ విడుదల చేయలేదు. ట్రాక్టర్ ను పోలీస్ ల నుంచి విడిపించుకోవడానికి వీలుగా వే బిల్లులు అవసరం అయ్యాయి. ఇసుక వే బిల్లులు మంజూరు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చినప్పటికి ఆర్ఐ వినకపోవడంతో వే బిల్లులు చించి వేసి దాడికి యత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
