మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. నేడు (మంగళవారం) జరిగిన పురుషుల సింగిల్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో తెలుగు తేజం శ్రీకాంత్ 9-21, 21-12, 21-6 తేడాతో చైనీస్ తైపీ షట్లర్ హువాంగ్ యు కాయ్‌పై విజయం సాధించాడు.
ఇక ఇతర క్వాలిఫాయింగ్ మ్యాచుల్లో తరుణ్ మన్నెపల్లి 13-21, 21-23 తేడాతో పానిట్‌ఛాపన్ (థాయ్‌లాండ్)… శంకర్ ముత్తుసామి సుబ్రమణ్యాన్ 20-22, 20-22తో జు జువాన్ చెన్ (చైనా) షట్లర్ల చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగారు.
మహిళల సింగిల్స్ క్వాలిఫయర్స్‌లో అన్మోల్ ఖర్బ్ కూడా ఓటమాపాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్ జగ్లాన్-లక్షిత జగ్లాన్ జోడీకి కూడా చుక్కేదురైంది. ఇక నేటి నుంచి మెయిన్ డ్రా పోటీలు ప్రారంభం కానున్నాయి. సింధు, ప్రణయ్, శ్రీకాంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.