బాధ్యతగా అభివృద్ధి చేసుకుందాం ఆదరించండి

బాధ్యతగా అభివృద్ధి చేసుకుందాం ఆదరించండి
- 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య
- రైటప్: ఓటరు మద్దతు కోరుతున్న 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య
మక్తల్, ఆంధ్రప్రభ : బాధ్యతగా మన వార్డును మనమే అభివృద్ధి చేసుకుందాం ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపించాలని 11వ వార్డు నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయశ్రీ చిన్న కొండయ్య విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వార్డు పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారాన్ని జోరుగా చేపట్టారు .మున్సిపల్ ఎన్నికల్లో తనను కౌన్సిలర్ గా గెలిపించండి వార్డు పరిధిలోని బురాన్ గడ్డ ప్రాంతాన్ని అభివృద్ధిలో బలా అనే రీతిలో తీర్చిదిద్దుతానని అన్నారు.
అదేవిధంగా ఆజాద్ నగర్ ప్రాంతాన్ని ఆదర్శవంతంగా, రెడ్డి నగర్ ప్రాంతాన్ని రాజసం ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అందుకు అందరి సహకారం కావాలన్నారు. మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం మనమంతా కలిసి ఎక్కడ ఏ సమస్య ఉన్న కలిసి చర్చించుకుని సమస్య పరిష్కారానికి కలిసి పని చేద్దాం అన్నారు .నాతో కలిసి నడవండి కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసుకుందామన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని గుర్తించాలన్నారు .రెండేళ్లుగా చేసింది శూన్యమన్నారు .కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకుల మిటలు నమ్మి మోసపోవద్దు ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించాలని జయశ్రీ చిన్న కొండయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సాయి శరత్ గౌడ్, మనోహర్ ,మధు ,అనిల్, నరేందర్ రెడ్డి, నవీన్, రవి, ప్రదీప్, రమేష్ ,నీల వర్ధన్ రెడ్డి, సాయి కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
