jobs : జాబ్ మేళాను విజయవంతం చేయండి

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

jobs పిచ్చాటూరు, ఆంధ్రప్రభ : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ఎస్ఎస్డీసీ, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్‌, సీడాప్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నజాబ్‌మేళా నవంబర్‌ 15 (శనివారం) ఉదయం 8 గంటలకు పిచ్చాటూరులోని ఎం.కె.టి మహల్‌ (ఎస్‌బీ‌ఐ బ్యాంక్‌ ఎదుట)లో జరగనుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ (ఈసీఈ, ఈఈఈ, మెక్‌) మరియు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అర్హత కలిగిన యువకులు, యువతులు పాల్గొనవచ్చని చెప్పారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు.

  • జాబ్ మేళాలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా https://naipunyam.ap.gov.in/under-maintenance వెబ్‌సైట్‌లో ఆధార్‌ ఓటీపీతో ట్రైనీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. అనంతరం తమ ప్రొఫైల్‌లో లాగిన్‌ అయ్యి కంపెనీలకు అప్లై చేసి అడ్మిట్‌ కార్డు ప్రింట్‌ తీసుకొని ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.
  • రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ నవంబర్‌ 14. సంప్రదించవలసిన ఫోన్‌ నంబర్లు 94403 74535, 99888 53335. సత్యవేడు నియోజకవర్గ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Leave a Reply