కౌన్సిలర్ గా గెలిపించండి.. ప్రజలకు రుణపడి ఉంటా – కాంగ్రెస్ అభ్యర్థి మెంట రమణ నగేష్..

కౌన్సిలర్ గా గెలిపించండి.. ప్రజలకు రుణపడి ఉంటా – కాంగ్రెస్ అభ్యర్థి మెంట రమణ నగేష్..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 12వ వార్డు కౌన్సిలర్ గా తమను గెలిపిస్తే.. ప్రజలకు రుణపడి ఉంటామని వార్డు అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మెంట రమణ నగేష్. ఆయన ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే.. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ల సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి.. వార్డు అభివృద్ధి వేగవంతం చేస్తానన్నారు. వార్డులోని సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరుతున్నారు.

Leave a Reply