సైన్స్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలి..

సైన్స్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలి..

క‌డెం, ఆంధ్ర‌ప్ర‌భ : కడెం మండలం(Kadem Mandal)లోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో రూ. 13 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన శాస్త్ర ప్రయోగ శాలను ఆదివారం అదిలాబాద్ ఎంపీ జి నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల(Science laboratory)ను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల(students)కు ఈ ప్రయోగశాల ఎంతో ఉపయోగపడుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఏ దేవన్న యాదవ్‌, ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగల భూమన్న భూషణ్, ఆత్మ కమిటీ చైర్మన్ జి సత్యనారాయణ, స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల, కడెం మండల విద్యాధికారి షేక్ హుస్సేన్, నచ్చన్ ఎల్లాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న, కాంగ్రెస్ మండల నాయకులు గొల్ల వెంకటేష్, ముస్కు రాజేందర్ రెడ్డి, ఆకుల లచ్చన్న, బిజెపి ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ మోహన్ నాయక్, కడెం మండల అధ్యక్షుడు కాశ వేణి శ్రీనివాస్ యాదవ్, మండల నాయకులు పి శ్రీరామ్ రాపర్తి, శ్రీనివాస్ ఎస్ ప్రవీణ్, రామగిరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply